Anganwadi Jobs: Good News.. అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల..

Anganwadi Jobs news

చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పలు గ్రూపుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు.

అంగన్ వాడీ వర్కర్ల పోస్టులు 11, మినీ వర్కర్లు 18, అసిస్టెంట్లు 58 పోస్టులు కలిపి 87 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలోని అన్ని సీడీపీఓ కార్యాలయాలకు ఆయా పోస్టుల ఖాళీల వివరాలను పంపినట్లు తెలిపారు.

Anganwadi Centers Funds news: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ ఎందుకంటే..

అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 10వ తరగతి చదివిన వివాహితలు, గ్రామ, వార్డు కార్యదర్శులు 4 నుంచి 19వ తేదీలోపు సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సీడీపీఓ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.

అర్హత: అంగన్‌వాడీ వర్కర్‌, మినీ అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు వివాహం చేసుకుని స్థానికంగా ఉండాలి.

అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి చెందిన వారు అయి ఉండాలి. అభ్యర్థులు 01.07.2024 నాటికి దరఖాస్తు చేసుకోవడానికి 21 సంవత్సరాల వయస్సు. వారు 35 ఏళ్లలోపు ఉండాలి

Latest Anganwadi news: కష్టాల్లో అంగన్‌వాడీలు ఇకపై ఈ కష్టాలు తప్పవ్‌..

21 ఏళ్లు నిండిన ఏ అంగన్‌వాడీ హెల్పర్ అయినా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 18 ఏళ్లు నిండిన వారు అంగన్‌వాడీ వర్కర్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ అసిస్టెంట్ వై.సి., యం.టి. అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అంగన్‌వాడీ వర్కర్‌, మినీ అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ అసిస్టెంట్‌ పోస్టుల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇస్తారు.

ప్రస్తుతం జూలై 2019 నుండి అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం: నెలకు రూ.11500/-, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం: రూ.7000/- అంగన్‌వాడీ హెల్పర్‌లకు గౌరవ వేతనం: రూ.7000.

#Tags