Anganwadi Centers Funds news: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ ఎందుకంటే..

Anganwadi news

రాజోళి: ఆటపాటలతో కూడుకున్న అమ్మఒడిలాంటిది అంగన్‌వాడీ కేంద్రాలు అని జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత అన్నారు. మండలంలోని ముండ్లదిన్నెలో రూ.13.75 లక్షలతో నిర్మించిన నూతన అంగన్‌వాడీ భవనాన్ని ఆమె గురువారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

Latest Anganwadi news: కష్టాల్లో అంగన్‌వాడీలు ఇకపై ఈ కష్టాలు తప్పవ్‌..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు గ్రామంలోనే ఎలాంటి భయం, ఆందోళన లేకుండా పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేయడంలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర చాలా ఉందని అన్నారు.

అమ్మ ఒడిలో ఆడుకుంటున్నామంటున్న ఆలోచనతోనే చిన్నారులకు ఓనమాలు నేర్పి, ఆట పాటలు నేర్పుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఇలాంటి భవనాలు ఉండటం వల్ల గ్రామాల్లో అంగన్‌వాడీల ప్రాముఖ్యత మ రింత పెరుగుతుంద న్నారు. జెడ్పీటీసీ సుగుణమ్మ, పెద్దింటి నాగే్‌ష్‌ దస్తగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు.

#Tags