Teachers Issues : మునిసిప‌ల్ ఉపాధ్యాయుల స‌మస్య‌లను ప‌రిష్కరించాల‌ని యూటీఎఫ్ దీక్ష‌!

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ సత్యాగ్రహ దీక్ష

ఏలూరు: రాష్ట్రంలో మున్సిపల్‌ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల కోసం ఇప్పటికే అధికారులకు ప్రాతినిధ్యం చేశామని, అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సత్యాగ్రహ దీక్ష చేశామని గుర్తు చేశారు.

DEO Praneetha: భావితర శాస్త్రవేత్తలుగా ఎదగాలి

మున్సిపల్‌ ఉపాధ్యాయులకు పీఎఫ్‌ ఖాతాలు తెరవాలని, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని, మున్సిపల్‌ యాజమాన్యంలో కూడా పండిట్‌, పీఈటీ పోస్టులు అప్‌గ్రేడేషన్‌ చేసి పదోన్నతులివ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని, హెచ్‌ఎంలలో అర్హులైన వారిని అర్బన్‌ ఎంఈఓలుగా నియమించాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అలాగే మున్సిపల్‌ పాఠశాలల్లో నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని, కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించాలని, వర్గోన్నతి చెందిన అప్పర్‌ ప్రైమరీ పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్ల పోస్టులు మంజూరు చేయాలని, పని సర్దుబాటులో సుదూర ప్రాంతాలకు (50 కిలోమీటర్లు దాటి) ఇతర యాజమాన్యాల్లోని పాఠశాలలకు పంపించిన ఎస్జీటీ ఉపాధ్యాయులను తిరిగి మున్సిపల్‌ యాజమాన్యంలో అవసరమైన ఉన్నత పాఠశాలలో సర్దుబాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

TGPSC Group 1 Mains: హైకోర్టు, సుప్రీంకోర్టులో అభ్యర్థుల పిటిషన్లు.. పరీక్షలు సజావుగా జరిగేనా?

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన పెద్ద ఎత్తున విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సత్యాగ్రహ దీక్షలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ రుద్రాక్షి, జిల్లా సహాధ్యక్షుడు జీ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మున్సిపల్‌ వింగ్‌ కన్వీనర్‌ ఈ శివశంకరరావు, జిల్లా కార్యదర్శి ఎన్‌.రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి బీ సుభాషిణి, ఏలూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ పర్వీన్‌ బేగం, జొన్నకూటి రాజారావు, నగర శాఖ నాయకులు కోరాడ కిరణ్‌ కుమార్‌, టీ మారుతి, కే మహంకాళి రావు, కేవీ అప్పారావు, కే దొరబాబు, కే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. దీక్ష అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవధానికి వినతిపత్రం సమర్పించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags