UTF District Council Meeting : పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం.. విద్యారంగంపై కీలక ఆదేశాలు..
అనంతపురం: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని శారదా బాలికల నగర పాలకోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 117 జీఓను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1998, 2008 ఎంటీఎస్ టీచర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు.
NEET-UG Re-Exam: ముగిసిన నీట్ రీ-ఎగ్జామ్.. సగం మంది అభ్యర్థులు డుమ్మా
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన యాప్‌లను తక్షణమే రద్దు చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ... బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని, సెకండరీ స్థాయి నుంచి సమాంతర మీడియంను కొనసాగించాలన్నారు.
NEET-UG Controversy: 'నీట్' అక్రమాలపై సీబీఐ కేసు నమోదు.. పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్
మునిసిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, పీఎఫ్ ప్రమోషన్లు, మెడికల్ రీయంబర్స్‌మెంట్ తదితర సమస్యల వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు రామప్ప, సరళ, కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్ ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శులు హనుమంతరెడ్డి, ప్రమీల, అర్జున్, సంజీవ్ కుమార్, రవికుమార్, రఘురామయ్య, శేఖర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ సుబ్బరాయుడు, మహమ్మద్ జిలాన్ పాల్గొన్నారు.