Two New Courses : త్వ‌ర‌లోనే రెండు కోత్త కోర్సులు.. ఈ విద్యార్థుల‌కే..!

ఏపీలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో ఇక కోర్సులు కాస్త పెర‌గ‌నున్నాయి.

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో ఇక కోర్సులు కాస్త పెర‌గ‌నున్నాయి. ఇప్పుడు ఉన్న కోర్సులు కాకుండా మ‌రో రెండు కోర్సుల‌ను వచ్చే విద్యా సంవత్సరంలో ప్ర‌వేశ పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నాట్లు యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ చెబుతున్నారు. అయితే, 2025-26 విద్యాసంవ‌త్స‌రం నుంచి రెండు కోర్సులైన ఆర్టిఫిషియల్‌ లెర్నింగ్‌ (ఎ-ఐ), మిషన్‌ లెర్నింగ్‌ (ఎం.ఎల్‌) అనే రెండు కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నార‌ని ఆర్జీయూకేటీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అమరేంద్ర కుమార్ ఇటీవ‌లె ప్ర‌క‌టించారు.

Inter Students Breaking News : ఇక‌పై ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో ప‌రీక్ష‌లు ఉండ‌వు.. కార‌ణం ఇదే.. ఏకంగా..

మండలంలోని ఇడుపులపాయ, ఒంగోలు ట్రీపుల్‌ ఐటీలను ఆయన ఆర్కే వ్యాలీ డైరెక్టర్‌ కుమారస్వామి గుప్తాతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ నేప‌థ్యంలో, విద్యార్థులు, అధ్యాపకులతో వేర్వేరుగా కలిసి విద్య బోధనపై ఆరా తీశారు. వివిధ ప్ర‌శ్న‌లు అడిగి వారి అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పీయూసీ-2 చదువుతున్న విద్యార్థులు ఎవరైనా పీయూసీ-1లో ఫెయిల్‌ అయింటే..

EAPCET 2025 : ఈసారి ఎప్‌సెట్ నిర్వ‌హ‌ణ‌లో మార్పులు.. ఈ కారణంతోనే..

అలాంటి వారికి ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి రెమిడియల్స్‌ తరగతి గదులు నిర్వహించి, పరీక్షలకు పంపుతాం అని చెప్పారు. పీయూసీ-2 పూర్తయ్యే సరికి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి ఇంజినీరింగ్‌ -1లో చేరే విధంగా స‌న్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త కోర్సుల ఏర్పాటు కోసం పీయూసీ, ఇంజినీరింగ్‌ కరికులమ్‌లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పరిపాలన అధికారి డాక్టర్‌ రవికుమార్‌, అకాడమిక్‌ డీన్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌, ఆర్థిక అధికారితోపాటు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags