Subject Teachers: స‌బ్జెక్టు ఉపాధ్యాయుల‌కు రెండు రోజుల శిక్ష‌ణ‌..!

నేటి నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం కానుంది. పూర్తి వివ‌రాలు ఇలా..

రాయవరం: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) అమలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలోని 12 పాఠశాలల్లో సీబీఎస్‌ఈని గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు.

Department of Commercial Taxes: జీఎస్టీ ట్రిబ్యునల్‌లో టెక్నికల్‌ మెంబర్‌ నియామకం.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

జెడ్పీ ఉన్నత పాఠశాల అల్లవరం, జెడ్పీహెచ్‌ఎస్‌, పేరూరు, జెడ్పీహెచ్‌ఎస్‌, కేశనపల్లి, జెడ్పీహెచ్‌ఎస్‌, తాపేశ్వరం, జెడ్పీహెచ్‌ఎస్‌, గొల్లవిల్లి, అల్లవరం మండలం గోడిలో ఉన్న ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ బాలురు, బాలికల పాఠశాల, ముమ్మిడివరంలోని ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల, పి.గన్నవరం మండలం నరేంద్రపురంలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలుర పాఠశాల, రామచంద్రపురం మండలం వెలంపాలెంలో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలుర పాఠశాల, అమలాపురం మండలం సమనసలో ఉన్న ఎంజేపీఏపీ బీసీ బాలుర పాఠశాల, రాజోలు దొరగారితోటలోఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు.

Education and Employment: ఐటీఐతో ఉన్న‌త విద్య‌, ఉపాధి అవకాశాలు..

ఈ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సబ్జెక్టు ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ నాన్‌ రెసిడెన్షియల్‌ మోడ్‌లో ఇస్తున్నారు. ఇంగ్లిషు, సోషల్‌, బయలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18, గణితం, పీఎస్‌, కెమిస్ట్రీ సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈ నెల 20, 21 తేదీల్లో కాకినాడ శాలిపేటలో ఉన్న మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే శిక్షణకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు హాజరు కావాల్సి ఉందని, ఏ ఒక్కరికీ మినహాయింపులు లేవని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి తెలిపారు.

Admissions: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags