TS Gurukulam: గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు.. వారికి తప్ప మిగిలిన వారికి అలాట్‌మెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు జీఓ 317 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు సొసైటీలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగి వారీగా కేటాయింపులు విడుదల చేసే క్రమంలో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉద్యోగులను మినహాయిస్తూ మిగతా ఉద్యోగులకు నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్, మలీ్టజోన్‌ కేటగిరీలను కేటాయి స్తూ గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో గురువారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. ఈమేరకు సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో కూడా ఈ కసరత్తు దాదాపు కొలిక్కి వచి్చనట్లు సమాచారం.

Degree Results: డిగ్రీ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ఒకట్రెండు రోజుల్లో ఈ సొసైటీలో కూడా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో ఏడాది క్రితమే ఉద్యోగ కేటాయింపులు జరిగాయి. తాజాగా ఉద్యోగుల వారీగా కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌) పరిధిలో మాత్రం ఈ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. 

స్పౌజ్‌ కేటగిరీ ఉద్యోగులకు న్యాయం చేయాలి: టిగారియా 
గురుకుల విద్యా సంస్థల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జీఓ 317 అమలు ప్రక్రియ పరిష్కారం కావడం శుభసూచకమని తెలంగాణ గవర్నమెంట్‌ ఆల్‌ రెసిడెన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (టిగారియా) అధ్యక్ష, కార్యదర్శులు మామిడి నారాయణ, మధుసూధన్‌ గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి స్పౌజ్‌గా ఉన్న కేటగిరీని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూల పరిధిలో ఉద్యోగి స్పౌజ్‌గా ఉన్న వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా పీహెచ్‌ కేటగిరి, సింగిల్‌ ఉమెన్, డివోర్స్, అన్‌ మ్యారీడ్, మెడికల్‌ కేటగిరీలను కూడా పరిగణించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈమేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. 
 

#Tags