Toughest State Board Exams: దేశంలో అత్యంత కఠినంగా ప్రశ్నపత్రాలు తయారుచేసే రాష్ట్రాలివే..

దేశంలో అత్యంత కఠినమైన బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే రాష్ట్రాల జాబితాను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విడుదల చేసింది. పది, 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో దేశంలోని పలు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డులు నిర్వహించే పరీక్షల కఠినత్వాన్ని బట్టి ఈ నివేదికను సిద్ధం చేశారు. దీని ప్రకారం..త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TBSE) నిర్వహించే పరీక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని తేలింది.

Google Company Earnings: నిమిషానికి రూ.2 కోట్లు!.. గూగుల్ ఎలా సంపాదిస్తుందో తెలుసా?

ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో దాదాపు  66.6 శాతం ప్రశ్నలు చాలా కఠినతరంగా ఉంటాయని నివేదికలో వెల్లడైంది. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (MSBSHSE) 53.57 శాతం కఠినత్వంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గోవా, ఛత్తీస్‌గఢ్ మరియు పశ్చిమ బెంగాల్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ  రాష్ట్రాల బోర్డ్స్‌ నిర్వహించే పరీక్షలు కఠినత్వం నుంచి మ‍ధ్యస్థంగా ఉంటాయని వెల్లడైంది. 

దేశంలో అత్యంత కఠినంగా బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే రాష్ట్రాల జాబితా

1. త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TBSE): 66.60 శాతం ప్రశ్నలు కఠినంగా ఉంటాయి
2. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (MSBSHSE): 53.57% శాతం
3. గోవా:  44.66%
4. ఛత్తీస్‌గఢ్ : 44.44% 
5. పశ్చిమ బెంగాల్:  33.33%

Intel Layoff: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కోత!

రిపోర్ట్స్‌ ప్రకారం.. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మణిపూర్, ఒడిశా, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ బోర్డుల ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయగా మెజారిటీ ప్రశ్నలు 'ఈజీ టు మీడియం' పరిధిలో ఉన్నట్లు తేలింది. 

#Tags