Top 10 Universities Ranking 2024: ప్రపంచంలోనే అత్యుత్తమ టాప్-10 విశ్వవిద్యాలయాలు ఇవే..
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్- 2024లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా, ఈసారి 91 యూనివర్సిటీలు జాబితాలో నిలిచాయి.
ఈ ర్యాంకింగ్‌లలో ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( IISc) బెంగళూరు 32వ స్థానంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలిచింది. దీంతో పాటు యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న టాప్-10 భారతీయ విశ్వవిద్యాలయాలు ఇవే..
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc): 32వ ర్యాంక్
- అన్నా యూనివర్సిటీ: 119వ ర్యాంక్
- మహాత్మా గాంధీ యూనివర్సిటీ: 134వ ర్యాంక్
- జామియా మిలియా ఇస్లామియా: 148వ ర్యాంక్
- శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్: 150వ ర్యాంక్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్: 152వ ర్యాంక్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి: 158వ ర్యాంక్
- భారతియార్ యూనివర్సిటీ: 160వ ర్యాంక్
- ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్: 162వ ర్యాంక్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా: 163వ ర్యాంక్
కాగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్- 2024లో వరుసగా ఆరవసారి చైనాకు చెందిన సింఘువా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. పెకింగ్ విశ్వవిద్యాలయం 2వ స్థానంలో ఉండగా, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మూడవ స్థానంలో నిలిచింది.
యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో టాప్-10 విశ్వవిద్యాలయాలు
- సింగువా యూనివర్సిటీ, చైనా: 1వ ర్యాంక్
- పెకింగ్ యూనివర్సిటీ, చైనా: 2వ ర్యాంక్
- నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, సింగపూర్: 3వ ర్యాంక్
- నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సింగపూర్: 4వ ర్యాంక్
- టోక్యో విశ్వవిద్యాలయం, జపాన్: 5వ ర్యాంక్
- హాంకాంగ్ విశ్వవిద్యాలయం, హాంకాంగ్: 6వ ర్యాంక్
- షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ, చైనా: 7వ ర్యాంక్
- ఫుడాన్ యూనివర్సిటీ, చైనా: 8వ ర్యాంక్
- జెజియాంగ్ విశ్వవిద్యాలయం, చైనా: 9వ ర్యాంక్
- చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, హాంకాంగ్: 10వ ర్యాంక్