Free Skill Training : వివిధ కోర్సుల్లో మూడు నెలల ఉచిత నైపుణ్య శిక్షణ.. దరఖాస్తులు ఇలా!
పులివెందుల రూరల్: పులివెందులలోని రింగురోడ్డు సమీపంలో ఉన్న నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మూడు నెలల ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నామన్నారు.
AP PGCET 2024 State Rankers : పీజీసెట్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులను సాధించిన డిగ్రీ విద్యార్థులు..
అసిస్టెంట్ సర్వేయర్, ఎలక్ట్రీషియన్, జూనియర్ ఎక్స్‌కవేటర్ ఆపరేటర్, టైలరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ మెయింటెనెన్స్ కోర్సులపై శిక్షణ ఇస్తామన్నారు. 10వ తరగతి ఆ పై చదివిన వారు 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 9వ తేదీలోపు ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, సర్టిఫికెట్లు, రెండు ఫోటోలతో న్యాక్ బిల్డింగ్‌లో హాజరుకావాలన్నారు. వివరాలకు 99851 42155, 98853 31972లను సంప్రదించాలన్నారు.
Science Labs in Schools : సైన్స్ ల్యాబ్‌ల ఉపయోగాలపై అధికారులు పరిశీలన చేయాలి..