Model School Admissions 2025 : మోడల్ స్పూల్లో ఈ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులు మోడల్ స్కూళ్లలో ప్రవేశం పొందేందుకు గొప్ప అవకాశం కల్పిస్తున్నారు సర్కార్. మండలంలోని పసునూరులో ఉన్న మోడల్ స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పలు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఈ తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది పాఠశాల యాజమాన్యం. ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందాలంటే ప్రవేశ పరీక్షతోనే సాధ్యం అవుతుంది.
6 నుంచి 10వ తరగతులకు అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మోడల్ స్కూల్ యాజమాన్యం. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ నెల 6వ తేది అంటే, సోమవారం ప్రారంభం కాగా, వచ్చే నెల.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు కోనసాగుతాయని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వివరించారు.
దరఖాస్తులు.. ఎంపిక విధానం ఇలా..
తెలంగాణలోని మోడల్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నుంచి మాత్రమే చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇక సీట్ల విషయానికొస్తే.. పాఠశాలలో 6వ తరగతిలో 100 సీట్లు, 7వ తరగతి నుండి 10 తరగతులలో ఖాళీ సీట్లు భర్తీ అవుతాయన్నారు. ఎంపిక చేసే విధానం ప్రవేశ పరీక్షతోనే ఉంటుందన్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీన ఉంటుందన్నారు.
Free 10th Study Material: ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
6వ తరగతి వారికి ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి వారికి మధ్యాహ్నం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు స్థానిక మోడల్ స్కూల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్. ప్రవేశాలపై, దరఖాస్తులు, ప్రవేశ పరీక్షలు వంటి విషయాలకు సంబంధించి ఏమన్న సందేహాలున్న, మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా.. 9492362945, 9398109152, నంబర్లను సంప్రదించగలరని, ప్రిన్సిపాల్ బి.చంద్రబాబు ప్రకటించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)