Holidays : ఏప్రిల్‌ 19, 21 తేదీల్లో హాలిడే.. కారణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19, 21వ తేదీన ప్రభుత్వం అప్షనల్‌ హాలిడేను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ts government holidays announcement

షబ్‌ ఏ ఖద్‌న్రు పురస్కరించుకుని ఏప్రిల్ 19వ తేదీన, రంజాన్‌ను పురస్కరించుకుని 21వ తేదీన ప్రభుత్వం అప్షనల్‌ హాలిడేను ప్రకటించింది.

టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్  | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

వేసవి సెలవులు ఇలా..
తెలంగాణలో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 12 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో 1-5 తరగతుల వారికి కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉండడంతో వారికి ఏప్రిల్‌ 17తో ఎగ్జామ్స్ పూర్తవుతాయి. 6వ తరగతి నుంచి 9వ తరగతుల వారికి ఏప్రిల్ 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను 21వ తేదీన విడుదల చేయనున్నారు.

☛ Telangana Schools Summer Holidays 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

ఏప్రిల్ 24న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని హెడ్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో మొత్తం 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రాంరభం అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

చదవండి: ఇంటర్  స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

ఈ ఏడాది సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..
సాధారణ సెలవులు ఇవే..
☛ జనవరి 1 : నూతన సంవత్సరం
☛ జనవరి 14 : భోగి
☛ జనవరి 15 : సంక్రాంతి
☛ జనవరి 26 : గణతంత్ర దినోత్సవం
☛ ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి
☛ మార్చి 7 : హోళీ
☛ మార్చి 22 : ఉగాది
☛ మార్చి 30 : శ్రీరామనవమి
☛ ఏప్రిల్ 5 : బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
☛ ఏప్రిల్ 7 : గుడ్ ఫ్రైడే
☛ ఏప్రిల్ 14 : అంబేడ్కర్‌ జయంతి
☛ ఏప్రిల్ 22 :  రంజాన్‌
☛ ఏప్రిల్ 23 : రంజాన్ తదుపరి రోజు
☛ జూన్ 29 : బక్రీద్
☛ జులై 17 : బోనాలు
☛ జులై 29 : మొహర్రం
☛ ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం
☛ సెప్టెంబరు 7 : కృష్ణాస్టమి
☛ సెప్టెంబరు 18 : వినాయక చవితి
☛ సెప్టెంబరు 28 :  మిలాద్‌-ఉన్‌-నబి
☛ అక్టోబర్ 2 :   గాంధీ జయంతి
☛ అక్టోబర్ 14 : బతుకమ్మ ప్రారంభం
☛ అక్టోబరు 24 : విజయదశమి
☛ అక్టోబరు 25 : విజయదశమి తర్వాతి రోజు
☛ నవంబర్ 12 : దీపావళి
☛ నవంబర్ 27 : కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
☛ డిసెంబరు 25 : క్రిస్మస్
☛డిసెంబర్ 26 : బాక్సింగ్ డే

ఇంటర్ :  ఇంటర్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..

☛➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

#Tags