Training for Teachers: ఉపాధ్యాయులకు 'జ్ఞాన జ్యోతి' శిక్షణ ప్రారంభం
సాక్షి ఎడ్యుకేషన్: జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా నిర్వహిస్తున్న ‘జ్ఞాన జ్యోతి’ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు ఆర్జేడీ వీఎస్ సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక రామచంద్ర మిషన్‌లో ప్రారంభమైన ఆరు రోజుల రీజినల్ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు వెరసి మొత్తం 160 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
➤ Navy Jobs for Women: మహిళలకు నౌకాదళంలో ఉద్యోగాలు..
శిక్షణ పొందిన వారు తమ మండలాల్లో అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. కోర్సు డైరెక్టర్ ఎ.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను అవగాహన చేసుకుని మండల స్థాయిలో మరింత అవగాహన కలిగించాలన్నారు. రాష్ట్ర పరిశీలకుడు డి.పాల్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 బాల్య సంరక్షణ, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ శిక్షణ ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమన్నారు.
➤ Students Work in Agriculture: విద్యాభ్యాసంలో భాగంగా వరి పంటలు..
ఏఎంఓ రమేష్ మాట్లాడుతూ రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో నిర్వహిస్తున్న కార్యక్రమం కనుక వసతుల అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. మూడు జిల్లాల ఐసీడీఎస్ పీడీలు శిక్షణ ప్రాధాన్యతను, రెండు డిపార్టుమెంట్లతో కలిసి శిక్షణ పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రథమ్ టీమ్ సభ్యులు రాజశేఖర్, భవాని, సుబ్బారావు, డైట్ లెక్చరర్ రవీంద్ర ప్రసాద్, కీ రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.