Students Work in Agriculture: విద్యాభ్యాసంలో భాగంగా వరి పంటలు..
సాక్షి ఎడ్యుకేషన్: స్టెల్లా కళాశాల అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగం విద్యార్థినుల విద్యాభ్యాసంలో భాగంగా 40 సెంట్ల స్థలంలో వరి వంగడలైన కుజిపటలియా, చిట్టిముత్యాలు రకాలను పండించారు. జూన్ నెలలో నారు పోశామని, ఎలాంటి క్రిమి సంహారక మందులు, పెస్టిసైడ్స్ వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులలో ఈ రెండు రకాల పంటలను విద్యార్థులు పండించారని కళాశాల అగ్రికల్చర్ విభాగాధిపతి లక్ష్మణస్వామి తెలిపారు.
➤ Counselling for Pharmacy Courses: ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల..
సాగు చేయటంలో విద్యార్థినులు సఫలీకృతం అయ్యారని, 10 బస్తాలకి పైగా పంట దిగుబడి వచ్చిందని, ఈ రెండు రకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉపయోగపడతాయని, వ్యక్తిలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని బాస్మతి రైస్ కంటే మంచి సువాసన కలిగిన వంగడాలని చెప్పారు. ఒక కంకికి 30 నుంచి 40 వడ్లు వస్తాయని ఆయన వివరించారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు చేసిన ఈ సేద్యం 10 బస్తాల దిగుబడిని కృష్ణాజిల్లా కానూరు, పెనమలూరుకు చెందిన రైతులకు వంగడాలుగా పంపిణీ చేశామని ఆయన తెలిపారు.