Govt School Inspection : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ!
చీరాల అర్బన్: బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. మంగళవారం చీరాలలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాలలో పిల్లల హాజరు పట్టిక పరిశీలించారు. అలానే తరగతి గదిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ముందు వరుసలో కూర్చోబెట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
Free Coaching: ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు
అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం పేరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్‌ను పరిశీలించి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం స్టాకు తక్కువగా ఉండడాన్ని గమనించి హెచ్‌ఎంను వివరణ కోరారు. ఈపురుపాలెం బైపాస్‌లోని కేజీబీవీని పరిశీలించారు. అక్కడ లైట్లు సక్రమంగా లేకపోవడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వేయించాలని సూచించారు.
ఉమ్మడి ప్రకాశం, బాపట్ల జిల్లాలో చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో కలిసి బాలబాలికల అభ్యున్నతికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆమె వెంట తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంఈఓ పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, హెచ్‌ఎంలు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, సిబ్బంది ఉన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)