BSF Officer: విద్యార్థులు ఆర్మీపై ఆసక్తి కనబర్చాలి

మల్కన్‌గిరి: విద్యార్థులు ఇండియన్‌ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనబర్చాలని బీఎస్‌ఎఫ్‌ అధికారి వీరేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సూచించారు.

స్థానిక డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కెరీర్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్‌ ఆర్మీకు ఎలా సన్నద్ధమవ్వాలి అనేది వివరించారు. ఆర్మీలో ఉంటే ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలియజేశారు. మల్కన్‌గిరి జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా రిక్రూట్‌మెంట్‌ అధికారి అజయ్‌ దీప్‌ మాట్లాడుతూ.. ఆగ్నీవీర్‌ యోజన ద్వారా విద్యార్థులు సైనికులుగా చేరవచ్చన్నారు. దీనికి సంబంధించి ఆసక్తి కలిగిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి: Free Coaching: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌.. ఎవరు అర్హులంటే..

#Tags