National Level Yoga: రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

యోగాశ్రమం విద్యార్థులు జాతీయ యోగా పోటీలకు ఎంపికైనట్లు అక్కడి గురువు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు వెళ్ళే విద్యార్థులను ఆయన అభినందించారు..

 

అమలాపురం టౌన్‌: స్థానిక శ్రీ స్వామి వివేకానంద యోగాశ్రమం విద్యార్థులు జాతీయ యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఆశ్రమానికి చెందిన బి.మేఘన, వి.శ్రావణి, వి.సారిక జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి ఈ పోటీలకు ఎంపికయ్యారని ఆశ్రమ గురువు డాక్టర్‌ ఆకుల శ్రీనివాస్‌ తెలిపారు.

SSC Exam Evaluation:ఎస్‌ఎస్‌సీ పరీక్షలు పూర్తి.. స్పాట్‌ వ్యాల్యూవేషన్‌కి తేదీ..!

ఈ నెల 25న అనకాపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు ప్రధమ స్థానంలో నిలిచారని, త్వరలో గుజరాత్‌ రాష్ట్రంలో జరగనున్న జాతీయ యోగా పోటీల్లో వారు పాల్గొంటారని ఆయన తెలిపారు. మాజీ జాతీయ యోగా న్యాయ నిర్ణేత మోటూరి భైరవస్వామి విద్యార్థులను ప్రశంసించారు.

Private Schools Admissions: నేడే ముగియనున్న ప్రవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు గడువు

#Tags