Opportunities for Students : ఆశలను అవకాశాలుగా మార్చుకోవడమే ఆధునిక టెక్నాలజీ
తాడేపల్లిగూడెం: తరగతి గదే దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, ఆశలను అవకాశాలుగా మార్చుకోవడమే ఆధునిక టెక్నాలజీ అని తిరుపతి ఐఐటీ కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చీమలకొండ శ్రీధర్ చెప్పారు. బుధవారం నిట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పలు విషయాల గురించి విద్యార్ధులకు వివరించారు.
Inter Students : ఉత్తమ విద్యాతోనే ఉన్నత భవిష్యత్తు..
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్ధులు నిశితంగా పరిశీలిస్తే, వాటిలో నుంచి కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో భవిష్యత్ అంతా కృత్రిమ మేధస్సుదే అన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకున్నవారే ఉద్యోగ అవకాశాలను పొందగలరన్నారు. కృత్రిమ మేధస్సు, సాంకేతికత ప్రాధాన్యతలపై విద్యార్థుల సమస్యలను నివృత్తి చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)