Government Schools and Colleges: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లవైపు మొగ్గు చూపుతున్న‌ విద్యార్థులు..!

ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఈ ఏడాది అడ్మిషన్లు బాగా పెరిగే అవకాశాలున్నాయి అని ప్రిన్సిపాల్‌ శాంతి రాజశ్రీ తెలిపారు..

కాకినాడ‌: గతంలో అందరూ ప్రైవేటు కళాశాలల వైపే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని ఉత్తమ విద్యా ప్రమాణాలను చూసిన విద్యార్థులు ఎక్కువ మంది వీటిల్లో చేరేందుకే ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది అడ్మిషన్లు బాగా పెరిగే అవకాశాలున్నాయి. మా కళాశాలలో చేరడానికి ఇప్పటికే చాలా మంది సిద్ధమయ్యారు. పాఠశాలలు తెరిచే సమయానికి మరింతగా పెరుగుతారని నమ్ముతున్నాం. పలు గ్రామాల్లోని హైస్కూళ్లను ప్రభుత్వం కళాశాలలుగా మార్చింది. సొంత గ్రామంలో కళాశాల రావడంతో ఇక్కడ చదువుకోవడానికే అందరూ ఉత్సాహం చూపుతున్నారు.

– ఎస్‌.శాంతి రాజశ్రీ, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (హైస్కూలు ప్లస్‌), చేబ్రోలు, గొల్లప్రోలు మండలం

EAPCET Rankers: ఈఏపీ సెట్‌లో విద్యార్థుల ప్ర‌తిభ‌.. ఈ ర్యాంకుల్లో నిలిచిన యువ‌కులు!

#Tags