No Malpractice : ప‌రీక్ష కేంద్రాల త‌నిఖీలు.. ఇన్విజిలేట‌ర్ల‌కు ఆదేశాలు

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌, ఇన్విజిలేటర్లపై వేటు ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

చిత్తూరు: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌, ఇన్విజిలేటర్లపై వేటు ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రెండు పాఠ్యాంశాలకు సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు.

10th Board Exam Inspection : టెన్త్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు.. ఇంచార్జ్ క‌లెక్ట‌ర్ ఆదేశాలు!

విద్యార్థుల పరంగా ఎలాంటి డిబార్‌ జరగకపోగా, విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. పూతలపట్టులో ఇద్దరు, నగరిలో ఒకరు, జీడీనెల్లూరు నెల్లేపల్లి పరీక్ష కేంద్రంలో ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించారు.

కేంద్రాల‌ త‌నిఖీలు..

పది పరీక్షల అబ్జర్వర్‌ జ్యోతికుమారి బుధవారం జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ విద్యాధరి ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్‌ పరీక్ష కేంద్రాన్ని, డీఆర్వో మోహన్‌కుమార్‌ కొంగారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి నగరపాలక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు 13 మంది 55 పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్‌ స్క్వాడ్‌ల సభ్యులు 41 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. హిందీ పరీక్షకు 20,609 మంది విద్యార్థులకు గాను 20,198 మంది హాజరుకాగా 411 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags