Sports Meet: క‌ళాశాల మైదానంలో స్పోర్ట్స్ మీట్

ప్ర‌క‌టించిన తేదీ ఆధారంగా ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా అధ్య‌క్షులు తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న మ‌రిన్ని స‌మావేశాల నిర్వాహ‌ణ, అక్క‌డ హాజ‌రైయ్యే అధికారులు, అధ్య‌క్షుల గురించి వెల్ల‌డించారు. ఆ వివ‌రాల‌ను తెలుసుకుందాం..
Organizing sports meet for employees of animal husbandry department

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 30న పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నరియన్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు జీ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం స్థానిక ఏపీ ఎన్‌జీఓ హోంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర చైర్మన్‌ బీ సేవానాయక్‌ ఆదేశాల మేరకు స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

TS TET 2023: టెట్‌ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!

ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 1న పాత బస్టాండ్‌ సమీపంలోని వెటర్నరీ పాలీ క్లినిక్‌ సమావేశ మందిరంలో నాల్గవ జోన్‌ స్థాయి కార్యవర్గ సమావేశం, ఉమ్మడి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నరియన్స్‌, పశు సంవర్ధక శాఖ సహాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Teachers Eligibility Test: ఉపాధ్యాయుల‌కు ప‌దోన్న‌తల‌ను క‌ల్పించాలి.. ఉత్త‌ర్వుల‌పై పునఃస‌మీక్షణ జ‌ర‌గాలి

ఈ సమావేశానికి రాష్ట్ర ఫెడరేషన్‌ నాయకులు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన జాయింట్‌ డైరెక్టర్స్‌, ఏపీఎన్‌జీఓస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ వెంగళరెడ్డి, వీ జవహర్‌లాల్‌ హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు జనార్దన్‌రెడ్డి, ఎస్‌ రంగన్న, ఏఎండీ యూసఫ్‌, కే సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags