IIT-NEET Coaching : గురుకుల పాఠశాలలో ఐఐటీ-నీట్ శిక్షణ.. ఈ తేదీకే ప్రారంభం..
సింగరాయకొండ: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వచ్చే నెల నుంచి ఐఐటీ–నీట్ శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. స్థానిక గురుకుల పాఠశాలను కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి గురువారం పరిశీలించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
మంత్రి మాట్లాడుతూ ఐఐటీ–నీట్ శిక్షణను 80 మంది విద్యార్థినులకు అందిస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పైలెట్ ప్రాజెక్టుగా డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది గురుకుల విద్యార్థులు 40 మంది నీట్‌లో సీట్లు సాధించారని ప్రశంసించారు. విద్యుత్, కోతుల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Jobs Mela : రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా.. విద్యార్హతలు ఇవే..!
పాకల బీచ్‌లో వసతులు కల్పిస్తామని చెప్పారు. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఈఎస్ కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేష్, జిల్లా కో ఆర్డినేటర్ జయ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి లక్ష్మానాయక్, ప్రిన్సిపాల్ రమాదేవి పాల్గొన్నారు.