Skill Training Programme: ఐసీటీ కంపెనీతో కలిసి 48వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఇన్ఫోసిస్‌

ఇన్ఫోసిస్ లిమిటెడ్‌ ఐసీటీ అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి 48 వేలమంది విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్‌ఆర్‌)లో భాగంగా నిర్వహించే ఈ శిక్షణకు రూ.33 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు మాట్లాడుతూ..‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌, తమిళనాడులోని ఐసీటీ స్వచ్ఛంద సంస్థతో కలిసి రానున్న మూడేళ్లలో 48 వేలమంది విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నాం. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తాం. ఇందుకోసం రూ.33 కోట్లు కేటాయించాం.

Study Abroad: విదేశీ విద్య.. స్కాలర్‌షిప్‌ పొందడమెలా? టోఫెల్‌ స్కోర్‌తో అక్రమాలు..ఈ విషయాల గురించి తెలుసా?

ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కోర్సులను అభ్యసించే విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాల పెంపునకు ఇది సహకరిస్తుంది’ అని తెలిపారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 6న జాబ్‌మేళా

‘దేశంలోని 450కి పైగా కళాశాలల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ యూత్ ఎంపవర్‌మెంట్ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు కేంద్రంగా పనిచేస్తుంది. విద్యార్థులకు కోర్ స్కిల్స్‌లో 80 గంటల శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్‌లో 20 గంటల శిక్షణ, సర్టిఫికేషన్‌ పూర్తి చేసిన వారికి  ప్లేస్‌మెంట్ సౌకర్యం, యూత్ ఎంపవర్‌మెంట్ సమ్మిట్‌లు, రియల్‌టైమ్‌ కోడింగ్ ప్రాక్టీస్ వంటివి ఏర్పాటు చేస్తాం.

‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’, ‘ఇన్ఫోసిస్ ఫ్లాగ్‌షిప్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌’ను ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులకు మరిన్ని నైపుణ్యాలు అందుబాటులోకి రానున్నాయి’ అని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ప్రకటనలో పేర్కొంది.

#Tags