NMMS Exam: స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో 31లోపు నమోదు చేసుకోవాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: గతేడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షలో ఎంపికై న విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ తుది గడువు అని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ బుధవారం తెలిపారు.

ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆమె చెప్పారు. గడువు ముగిసిన తరువాత ఎటువంటి పొడిగింపు ఉండదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థి పేరు, పుట్టినతేదీ, తండ్రిపేరు, మెరిట్‌కార్డు, ఆధార్‌కార్డుపై ముద్రించిన విధంగానే ఏ ఒక్క అక్షరం తేడా లేకుండా ఉండాలని తెలిపారు. ఆధార్‌ వివరాలు సరిపోలని పక్షంలో వివరాలు సరైనవి కావనే సమాచారం వస్తుందని, ఈ విధంగా వచ్చినవారు డీఈఓ కార్యాలయంలో ఈనెల 27లోపు ఆధార్‌ మిస్‌మ్యాచ్‌ వివరాలను సమర్పించాలని సూచించారు. విద్యార్థి సమర్పించిన దరఖాస్తును సంబంధిత స్కూల్‌ నోడల్‌ అధికారిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, ఫిబ్రవరి 15లోపు సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా నవంబర్‌ 2019, ఫిబ్రవరి 2021, మార్చి 2022 సంవత్సరాల్లో ఎంపికై , ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు విధిగా రెన్యువల్‌ చేయించుకోవాలని సూచించారు.

చదవండి: Admissions: ఐదో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

#Tags