Selected Candidates : జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులు..

నెల్లూరు: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జాబ్‌మేళాకు పలువురు నిరుద్యోగులు హాజరయ్యారు. మొత్తం ఐదు కంపెనీలు పాల్గొని అర్హులైన వారిని ఎంపిక చేశాయి. టాటా ఏఐఐజీ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ ఇద్దరు, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ నలుగురు, సంగీత మొబైల్స్‌ ఇద్దరు, ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ 11 మంది, ఈఐఎంఎంఎస్‌ నలుగురు చొప్పున మొత్తం 23 మందిని ఆయా కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. ఎంపికైన వారికి జిల్లా ఉపాధి కల్పనాధికారి కేవీ రామాంజనేయులు నియామక పత్రాలను అందజేశారు.

Seat in IIT Kharagpur : ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యార్థికి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సీటు

#Tags