IIIT Admissions : ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు రెండో విడ‌త జాబితా విడుద‌ల తేదీ.. హాజ‌రుకాని వారికోసం!

ఏపీ ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి రెండో విడత ఎంపిక జాబితాను ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్లు అడ్మిషన్ల ప్రక్రియ కన్వీనర్‌ తెలిపారు..

వేంపల్లె: ఆర్జీయూకేటి పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి రెండో విడత ఎంపిక జాబితాను ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్లు అడ్మిషన్ల ప్రక్రియ కన్వీనర్‌ ప్రొ.అమరేంద్రకుమార్‌ సండ్రా తెలిపారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు కొనసాగిన మొదటి విడత కౌన్సెలింగ్‌కు 4 క్యాంపస్‌ల నుంచి మొత్తం 4140 మంది విద్యార్థులను పిలిచామన్నారు. అందులో 3396 మంది హాజరై అడ్మిషన్లు పొందారన్నారు. 744 సీట్లు మిగిలాయని, వీటి భర్తీ కోసం రెండో విడత జాబితాను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.

Students Appreciation : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌ ప్ర‌తిభ‌కు ప్రోత్సాహ‌కాలు లేన‌ట్టేనా..!

మొదటి విడతలో ఎంపికై హాజరుకాని విద్యార్థులు www.rgukt.in వెబ్‌ సైట్‌ ద్వారా రెండో విడత కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే మొదటి విడతలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు ఎవరైనా క్యాంపస్‌ మార్పు చేసుకోదలచిన వారు సదరు వైబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 28వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే వైబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు ఆగస్టు 19, 20 తేదీల్లో వారికి కేటాయించిన క్యాంపస్‌లో తరగతులకు హాజరు కావాలని కోరారు.

Mann Ki Baat: ‘ఈ దుస్తులు కొనండి’.. పెరిగిన ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు

#Tags