Schools and Colleges Holidays : పండ‌గే పండ‌గ‌..న‌వంబ‌ర్ 25, 26, 27, 29, 30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. న‌వంబ‌ర్ 27వ తేదీన (సోమ‌వారం) కార్తీక పౌర్ణ‌మి, గురునాన‌క్ జ‌యంతి సంద‌ర్భంగా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఉండ‌నున్న‌ది.

అలాగే న‌వంబ‌ర్ 26వ తేదీన సాధార‌ణంగా స్కూల్స్‌,కాలేజీల‌కు సెలవు ఉన్న విష‌యం తెల్సిందే. దీంతో స్కూల్స్‌, కాలేజీల‌, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వ‌రుస‌గా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. అలాగే న‌వంబ‌ర్ 25వ తేదీన నాలుగో శ‌నివారం సంద‌ర్భంగా కొన్ని స్కూల్స్‌ల‌కు ఆ రోజు కూడా సెల‌వు ఉంటుంది. దీంతో దాదాపు మూడు రోజులు పాటు చాలా స్కూల్స్‌, బ్యాంక్‌ల‌కు సెల‌వులు రానున్నాయి. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం న‌వంబ‌ర్ 27వ తేదీన ప‌బ్లిక్ హాలిడే లేదు. ఆ రోజు ఆప్ష‌న‌ల్ హాలిడే ప్ర‌క‌టించారు.

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

న‌వంబ‌ర్ 29, 30వ తేదీల్లో సెల‌వులు..

తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా మ‌రో రెండు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి. అలాగే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆఫీస్‌ల‌కు కూడా ఒక రోజు సెలవు ఇవ్వ‌నున్నారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, కార్యాలయాలకు నవంబరు 29న కూడా సెలవు ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన కూడా అన్ని ప్రభుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు ప్ర‌భుత్వం సెల‌వును ప్ర‌క‌టించింది.

డిసెంబ‌ర్ 3వ తేదీన కూడా.. సెల‌వు :

డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగే ఆయా కార్యాలయాలకు సెలవు ఉంటుందని సీఎస్ శాంతికుమారి అక్టోబ‌ర్ 16వ తేదీన (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగుల‌కు వేతనంతో కూడిన సెలవుదినంగా ఉంటుంద‌న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

పై సెల‌వుల‌పై స‌మ‌గ్ర వివ‌రాల‌ను మీ స్కూల్‌, కాలేజీ సిబ్బంది అడిగి తెలుసుకోండి. అలాగే మీరు పూర్తి వివ‌రాలను తెలుసుకోని మీరు సెల‌వులను తీసుకోండి.

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

#Tags