Schools and Colleges Holidays : నేడు, రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు.. కార‌ణం ఇదే..!

గ‌త కొద్దిరోజులుగా వ‌ర్షాలు, తుఫాన్‌ల కార‌ణంగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులను ప్ర‌క‌టిస్తోంది ప్ర‌భుత్వం. ఇలా, ఒక‌దాని వెంట ఒకటి అల్ప‌పీడ‌నాలు, తుఫాన్లు దాదాపు రెండు నెల‌ల నుంచి ఏర్ప‌డుతూనే ఉన్నాయి.

సాక్షి ఎడ్యుకేష‌న్: స‌హ‌జంగా న‌వంబ‌ర్‌-డిసెంబ‌ర్ నెల‌లో అల్ప‌పీడ‌నాలు, వ‌ర్షాలు ఏర్పడుతూనే ఉంటాయి. కాని, ఈసారి ఈ వ‌ర‌దలు, తుఫాన్‌లు, అల్ప‌పీడ‌నాలు మ‌రింత ఎక్కువే అయ్యాయి. దీని కార‌ణంగా ఎన్నో సార్లు ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌ల‌కు వ‌రుస‌ సెలవుల‌ను ప్ర‌క‌టించింది.

AP Inter Public Exams Schedule 2025 : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీ ఇంటర్‌ ప‌బ్లిక్‌ పరీక్షలు తేదీలు విడుద‌ల‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...

తాజాగా, నేడు బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా రూపు దాల్చింది. ఇది వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 24 నుంచి 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది.

AP 10th Public Exams Schedule 2025 : ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ 2025 విడుద‌ల‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే.. ఈసారి మాత్రం..

ప‌ది జిల్లాల‌కు

దీని ప్రభావంతో తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, అక్క‌డి ప్ర‌భుత్వం చెన్నై సహా ప‌ది (10) జిల్లాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. దీంతో, చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాడుథురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూరు, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు నేడు తెరచుకోవు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

త‌మిళ‌నాడులో చెన్నై స‌హా.. కడలూరు, మైలాడుథురై, నాగపట్నం, కరైకల్, చెంగల్పట్టు, విల్లుపురంలల్లో వర్షాలు దంచికొడుతుండ‌గా..  తిరువారూరు, తంజావూరు, కాళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి.

Athletics Championship: అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయికి రజతం

ఎల్లో అల‌ర్ట్‌

ఇదిలా ఉంటే, కంచీపురంలో ఎల్లో అల‌ర్ట్ జారీ చేసిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం, ఈ నెల 14వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అంతేకాకుండా, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్న‌ట్లు చెబుతోంది. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలని, అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం స‌హా వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags