Teachers Promotions : ఉపాధ్యాయుల ఉద్యోగోన్న‌తుల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: మున్సిపల్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు షెడ్యూల్‌ విడుదల చేసినట్లు నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నడిపినేని వెంకట్రావు, బొనిగల హైమారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Science Exhibition : జోనల్‌ స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌.. 33 గురుకులాలు 88 వర్కింగ్‌ నమూనాల ప్ర‌ద‌ర్శ‌న‌!

గ్రేడ్‌–2 హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు నవంబర్‌ ఒకటో తేదీ వరకు సీనియార్టీ జాబితాల విడుదలతో పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. నవంబర్‌ 4న తుది సీనియార్టీ జాబితా విడుదల చేసి, ఆరో తేదీన గ్రేడ్‌–2 హెచ్‌ఎం పోస్టులకు, 8న అన్ని సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు. ఉద్యోగోన్నతుల ప్రక్రియ అడ్‌హక్‌ పద్ధతిలో చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వివరించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags