Webinar : విద్యార్థులారా.. ఆత్మ‌హ‌త్య‌లు వ‌ద్దు.. భవిష్యత్‌కు దారులెన్నో..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: మానసిక ఒత్తిడి.. టెన్షన్‌.. యాంగ్జయిటీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలోనూ.. సర్వసాధారణంగా కనిపిస్తున్న లక్షణాలు!

ఈ మ‌ధ్య కొంతకాలంగా ఎక్కడ చూసినా.. మానసిక ఒత్తిడి అనేది సహజ సమస్యగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ స‌మ‌స్య మ‌రి ఎక్కువ‌గా ఉంది. ఉజ్వల భవిష్యత్తులకు దారితీయాల్సిన ఈ చదువులు.. చావుకు కారణమవుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయితే.. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య చేసుకునే వర‌కు వెళ్లుతున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో జ‌రిగాయి.

ఈ భ్రమను విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తొల‌గించాల‌నే ఉద్ధ్యేశంతోనే..

కేవలం మార్కులు, ర్యాంకులు, సీట్ల మీదే విద్యార్థులు ఫోకస్‌ పెడుతున్నారు. కేవలం పరీక్షల్లో మార్కులు రానంత మాత్రాన భవిష్యత్‌ అధ్వానంగా ఉంటుందన్న భ్రమను విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తొల‌గించాల‌నే ఉద్ధ్యేశంతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకం మే 6వ తేదీ (శ‌నివారం) ఉద‌యం 11:30 నుంచి మ‌ధ్యాహ్నం 12 : 30 వ‌ర‌కు వెబ్‌నార్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ వెబ్‌నార్‌లో ప్ర‌ముఖ సైకాలజిస్టులు Dr Srinivas Kilaru, Dr G Shankar Rao పాల్గొన్నున్నారు. అలాగే ప్ర‌ముఖ‌ విద్యావేత్త‌లు, విద్యార్థులు పాల్గొన‌నున్నారు. ఈ వెబ్‌నార్‌ను https://www.facebook.com/sakshieducationcom ఫెస్‌బుక్ ఫేజీలో Live లో కూడా చూడొచ్చు. అలాగే ఈ వెబ్‌నార్ పూరైన‌ వెంట‌నే పూర్తి వీడియోను Sakshi Education YouTube Channelలో కూడా చూడొచ్చు.

Join Zoom Meeting :
Zoom Link : https://zoom.us/j/99496548478?pwd=eHlDV2ZGb21hMWhvTGFnNi91NUdpdz09
Meeting ID: 99496548478
Passcode: 540720

#Tags