Degree 6th Sem Results : డిగ్రీ ఆరో సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రీవాల్యుయేషన్‌కు గ‌డువు!

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఆరో సెమిస్టర్‌ (రెగ్యులర్‌, సప్లిమెంటరీ) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం వర్సిటీలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ జి.వెంకట నాయుడు ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానభూమి పోర్టల్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. రీవాల్యుయేషన్‌ దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువుగా నిర్దేశించామన్నారు. మొత్తం 10,906 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 8,468 (77.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

IISER Triupati Launches Masters Programmes: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌లో శిక్షణ.. చివరి తేదీ ఇదే

బీఏ కోర్సులో 908 మందికి గానూ 621 మంది (68.39 శాతం), బీబీఏలో 871 మందికి 436 మంది (50.06 శాతం), బీసీఏలో 28 మందికి 27 మంది, బీకాంలో 4,621 మందికి 3,051 మంది, బీఎస్సీ 4,478 మందికి 4,333 (96.76 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎంవీ లక్ష్మయ్య, ఫలితాల ప్రకటన కమిటీ సభ్యులు ప్రొఫెసర్‌ జి. శోభాలత, డాక్టర్‌ పి. శంకరయ్య, డాక్టర్‌ డి. జయరామి రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ సి. లోకేశ్వర్లు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎం. శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Good News Anganwadi workers 2024 : అంగన్వాడీ టీచర్లు , హెల్పర్‌కు గుడ్‌న్యూస్ .. వీరికి రూ.2 లక్షల వ‌ర‌కు..

#Tags