TRR College: టీఆర్‌ఆర్‌ కళాశాలలో రీసెర్చ్‌ సెంటర్‌

కందుకూరు రూరల్‌: కందుకూరు టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో రీసెర్చ్‌ సెంటర్‌ను కేటాయించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.రవికుమార్‌ తెలిపారు. ఫిజిక్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్లలో రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి అందులో పనిచేస్తున్న డాక్టరేట్‌ అధ్యాపకులను రీసెర్చ్‌ గైడ్‌లుగా గుర్తించారని తెలిపారు. ఇటీవల ఇతర యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్ల బృందం కళాశాలను సందర్శించి డిపార్ట్‌మెంట్లలోని మౌలిక వసతులను పరిశీలించి ఆంధ్రకేసరి యూనివర్సిటీకి నివేదిక అందజేసిందన్నారు. రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశోధనలు ఊపందుకుంటాయన్నారు.

చదవండి: Academic Examination: 23 నుంచి విద్యార్థులకు పరీక్షలు

#Tags