Vocational Trainers : ఈ పాఠ‌శాల‌ల్లోని ఒకేష‌న‌ల్ ట్రైన‌ర్ల‌కు రెన్యూవ‌ల్‌..!

అనంతపురం: ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లల్లో పని చేస్తున్న ఒకేషనల్‌ ట్రైనర్లకు 2024–25 విద్యా సంవత్సరానికి రెన్యూవల్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 50 స్కూళ్లలో ఒకేషనల్‌ ట్రైనర్లు పని చేస్తున్నారు. టైలరింగ్‌, బ్యూటీషియన్‌ అండ్‌ వెల్‌నెస్‌, ఐటీ తదితర కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. గత ఏడాది పని చేసిన స్కూళ్లల్లో వెంటనే రిపోర్ట్‌ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో పని చేస్తున్న వీరికి సమగ్రశిక్ష కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.

Degree Admissions : డిగ్రీ క‌ళాశాల‌ల్లో ఈ గ్రూపుల్లో అడ్మిష‌న్లు ప్రారంభం..

#Tags