Polytechnic Admissions: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ జారీ..

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

నూజివీడు: ఉద్యాన పంటల సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఉద్యాన పాలిటెక్నిక్‌ (డిప్లోమా ఇన్‌ హార్టీకల్చర్‌) కోర్సులో ప్రవేశాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్శిటీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిలో భాగంగా పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Telangana Inter board: ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి

జూన్‌ 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్‌తో పాటు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి అడ్మిషన్‌లను భర్తీ చేస్తామని నూజివీడు ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రత్తిపాటి విజయలక్ష్మి గురువారం చెప్పారు. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో నూజివీడు, కలికిరి ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 40 సీట్లు చొప్పున, రామచంద్రాపురం, మడకశిరలలోని కళాశాలల్లో 60 సీట్లు చొప్పున మొత్తం 200 ఉన్నాయి. ఈ నాలుగు కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 20 సీట్లు అదనంగా ఉన్నాయి.

School Education: విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు అవగాహన

అలాగే వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం గుర్తింపు కలిగిన ఏడు ప్రైవేటు కళాశాలల్లో ఒక్కొక్క దానిలో 40 సీట్ల చొప్పున 280 సీట్లు ఉన్నాయి. వీటికి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 28 సీట్లు అదనంగా ఉన్నాయి. హార్టికల్చర్‌ డిప్లోమా పూర్తయిన అనంతరం హార్టీ సెట్‌ రాసి బీఎస్సీ హార్టకల్చర్‌ కోర్సును సైతం చదువుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని కళాశాల వర్గాలు తెలిపాయి.

TSPSC: గ్రూప్‌–1 ప్రిలిమినరీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

#Tags