Teacher's Felicitation: ఉపాధ్యాయులకు ఘ‌నంగా స‌త్కారం

ఎన్నో విధాలుగా మంగ‌ళ‌వారం రోజు సంబ‌రాలు జ‌రిపారు. ఉపాధ్యాయుల గురించి గొప్ప‌గా వ‌ర్ణిస్తూ, ఘ‌నంగా స‌త్క‌రించారు ప‌లు మంత్రి వ‌ర్గాలు. అధ్యాప‌కుల‌ను స‌త్క‌రించి గురువుల గొప్ప‌ను త‌మ మాటల్లో స్ప‌ష్టించారు.
ministers and collector felicitates and speakes for teachers

సాక్షి ఎడ్యుకేష‌న్: గురువు ప్రతి ఒక్కరి జీవితంలో విజ్ఞానమనే వెలుగులు నింపుతాడని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి జ్ఞానసృజన చేసే రెండో బ్రహ్మ గురువని అన్నారు. ప్రపంచం మొత్తం టీచర్స్‌డే జరుపుకుంటుంటే, ఒక్క భారతదేశం మాత్రమే విద్యాబుద్ధ్దులను నేర్పడంతో పాటు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని జరుపుకుంటున్నట్లు వివరించారు.

Inspiring Teachers 2023: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు ఉండేదని, మనఊరు మనబడితో సర్కారు బడుల రూపం మారిందని అన్నా రు. కలెక్టర్‌ బి.గోపి మాట్లాడుతూ సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచి పుస్తకంలోని ప్రపంచంతో పాటు వాస్తవిక ప్రపంచాన్ని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. చొప్పదండి ఎమ్యెల్యే సుంకె రవి శంకర్‌ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్నారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ గురువుకేవలం ఉపాధ్యాయ దినోత్సవం నాడే కాకుండా ప్రతిరోజు పూజింపబడాలని అన్నారు.

Teacher's Day Celebrations: పాఠ‌శాల‌లో ఘ‌నంగా ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌లు

అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ గోపి, ఎమ్మెల్యే జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు 2023–24 సాధించిన 33మంది ఉపాధ్యాయులను, 16మంది ప్రైవేటు టీచర్లను పూలమాల, శాలువ, మెమోంటోతో సత్కరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, సుడా చైర్మన్‌ జీవీ.రామక్రిష్ణ, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుద్రరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌గౌడ్‌, డీఈవో జనార్దన్‌రావు, నంది శ్రీనివాస్‌, అనంతచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

#Tags