MANUU Admissions 2024: పాలిటెక్నిక్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు.. వారే దరఖాస్తుకు అర్హులు

కడప ఎడ్యుకేషన్‌: కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మిషన్ల గడువు మే 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అబ్దుల్‌ ముఖ్సిత్‌ఖాన్‌ తెలిపారు. పదవ తరగతి రెగ్యులర్‌ లేదా ఓపెన్‌లో ఉర్దూ మీడియం లేక ఉర్దూ సబ్జెక్టు చదువుకొని ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.

రెండవ సంవత్సరం పాలిటెక్నిక్‌లో చేరాలనుకునేవారు రెండేళ్ల ఐటీఐ లేకపోతే ఇంటర్మీడియట్‌ చదివి ఉండాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ రాత పరీక్ష జూన్‌ 12వ తేదీ మధ్యాహ్నం కడప క్యాంపస్‌లో ఉంటుందని తెలిపారు. పరీక్ష ఆధారంగా ర్యాంకు ద్వారా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.

TS POLYCET 2024: ఈనెల 24న పాలిసెట్‌ పరీక్ష..

మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, అప్ప రెట్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయని వివరించారు. అబ్బాయిలకు ఆఫ్లికేషన్‌ ఫీజు రూ.550, అమ్మాయిలకు రూ. 350 చెల్లించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు htpps://manuu coe.in/regularAdmision ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9398083058 నెంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

#Tags