Quiz Competitions: క్విజ్‌ పోటీలతో విద్యార్థులకు జ్ఞాన వృద్ధి

బళ్లారి రూరల్‌: క్విజ్‌ పోటీలతో వైద్య విద్యార్థులకు పరిజ్ఞానం పెంపొందుతుందని విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గంగాధరగౌడ తెలిపారు. సోమవారం విమ్స్‌ వైద్యభవన్‌లో వైద్యవిద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. విమ్స్‌ పీడియాట్రిక్స్‌ విభాగం అనేక ప్రాయోజిత కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ దుర్గప్ప మాట్లాడుతూ 60 శాతం మంది పిల్లలు అపౌష్టికతతో బాధపడుతున్నారన్నారు. విమ్స్‌లోని ఎన్‌ఐసీయూ 50 రోజులపాటు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన పిల్లలుగా మారుస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విమ్స్‌ ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ కృష్ణస్వామి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఖాసాసోమశేఖర్‌ క్విజ్‌ పోటీల లబ్ధిని వివరించారు. ఐఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీకాంత్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ రవిభీమప్ప, డాక్టర్‌ వాణి, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.

Safe IT Jobs: సేప్టీ ఎక్కువ‌గా ఉన్న‌ ఐటీ జాబ్‌లు ఇవే...

#Tags