Exam Fee: కేజీబీవీ, మోడల్‌ ఇంటర్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు జమ

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని 32 కేజీబీవీలు, 15 మోడల్‌ స్కూళ్లలో చదువుతున్న ఇంటర్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు మొత్తం ఆయా స్కూళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. కేజీబీవీల్లో 963 మంది సీనియర్‌, 751 మంది జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థినులు, మోడల్‌ స్కూళ్లలో 359 మంది సీనియర్‌, 314 జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించి మొత్తం రూ.16,34,250 మొత్తాన్ని స్కూళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ జూలుకుంట వరప్రసాదరావు తెలిపారు. పరీక్ష ఫీజును ఈ నెల 27లోగా చెల్లించాలన్నారు.

చ‌ద‌వండి: School Holidays List December 2023 : స్కూల్స్‌కు 9 రోజులు సెల‌వులు.. బ్యాంకులకు 14 రోజులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags