Kala Utsav: జిల్లా స్థాయి క‌ళా ఉత్స‌వ్ పోటీలు

తూర్పు గోదావ‌రి జిల్లాలో నిర్వ‌హించ‌నున్న ఈ క‌ళా ఉత్స‌వ్ పోటీల‌కు హాజ‌ర‌య్యేందుకు పోటీ వివ‌రాల‌ను, తేదీను ప్ర‌క‌టించారు ప్రిన్సిపాల్. క‌ళా ఉత్స‌వ్‌లో నిర్వ‌హించే ప్ర‌తీ పోటీ పేరును పేర్కొంటూ స్ప‌ష్టంగా వెల్ల‌డించారు..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఈ నెల 11, 12 తేదీల్లో బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్‌)లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ ఎస్‌డీవీ రమణ గురువారం ఈ విషయం తెలిపారు. ఈ పోటీలకు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, కేజీబీవీ, ఏపీ మోడల్‌, ఉన్నత పాఠశాల ప్లస్‌లలో 9, 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు.

Chandrayaan-3 Mision: భూ కక్ష్యకు ప్రొపల్షన్ మాడ్యుల్‌

గాత్రం (సంగీతం), గాత్రం (జానపద), వాద్య సంగీతం (వాద్య), వాద్య సంగీతం (మెలోడి), నాట్యం (సంప్రదాయ), నాట్యం (జానపద) విభాగాల్లో 11న పోటీలు జరుగుతాయని తెలిపారు. అలాగే, 12న దృశ్య కళలు (ద్విమితీయ), దృశ్య కళలు (త్రిమితీయ), సంప్రదాయబద్ధ ఆటబొమ్మలు, ఆటలు, నాటిక (ఏకాపాత్రాభినయం) విభాగాల పోటీలు జరుగుతాయన్నారు. ఒక విద్యా సంస్థ నుంచి ఒక్కో కళా రూపంలో ఒక బాలుడు, ఒక బాలిక విడివిడిగా పాల్గొనాలన్నారు. గత ఏడాది జరిగిన పోటీల్లో బహుమతులు సాధించిన వారు ఈ ఏడాది అనర్హులని తెలిపారు.

ICDS Posts Interview: వివిధ పోస్టుల భ‌ర్తీకి ఐసీడీఎస్‌లో ఇంట‌ర్య్వూలు

పోటీల్లో పాల్గొనే వారు అవసరమైన సామగ్రి తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాల తరఫున పాల్గొనే వారి వివరాలు, పోటీ అంశాలను నిర్దేశిత ప్రొఫార్మాలో gdieteg@gmail.com ఈ–మెయిల్‌కు లేదా అధ్యాపకులు కేవీ సూర్యనారాయణకు 99496 02721, కె.గంగాధరరావుకు 94403 39416, ఎస్‌.బాలరాజుకు 89196 91293 నంబర్లలో వాట్సాప్‌ చేసి, నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు పై నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
 

#Tags