A.Joshitha : అంకగణితంలో అంతర్జాతీయ స్థాయి ప్రతిభ చూపిన ఎ.జోషిత

A.Joshitha : అంకగణితంలో అంతర్జాతీయ స్థాయి ప్రతిభ చూపిన ఎ.జోషిత

గణితశాస్త్రంలో అసమాన ప్రతిభ చూపి అంతర్జాతీయ స్థాయిలో ఔరా అనిపిస్తోంది తిరుపతి కేశవాయనగుంటకు చెందిన ఆవుల ఢిల్లీ, రేఖ దంపతుల కుమార్తె ఎ.జోషిత. ఈమె చిన్నతనం నుంచి గణితశాస్త్రంలో చురుకుగా కనిపించేది. ఆ బాలిక ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తిరుపతిలోని అబాకస్‌ శిక్షకులు సునీతా నాగరాజ్‌, వినయ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న జోషిత గత మూడేళ్లుగా అబాకస్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. గత రెండేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి, పలుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది జూలైలో కాకినాడ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి అబాకస్‌ ప్రోడజీ–2024లో చాంపియన్‌గా నిలిచి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఇదీ చదవండి: నా జీవితంలో మలుపుతిప్పిందన ఘ‌ట‌న ఇదే... ఇందుకే కలెక్టర్ అయ్యా..

అలాగే కోల్‌కతా వేదికగా ఈనెల 10వ తేదీన జరిగిన 21వ ఎస్‌ఐపీ అబాకస్‌ – మెంటల్‌ అర్థమెటిక్‌ ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌లో ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల నుంచి 7,800 మంది బాలబాలకలు పాల్గొన్నారు. ఇందులో 300 క్లిష్టమైన గణిత సమస్యలను కేవలం 11 నిమిషాల్లో వేగం, కచ్చితత్వంతో సాధించిన జోషిత అడ్వాన్స్‌డ్‌ లెవల్‌ నాలుగో విభాగంలో మొదటి స్థానాన్ని సాధించింది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలన్నదే లక్ష్యమని నిగర్వంగా చెబుతోంది.

#Tags