JNTUA B.Tech& B.Pharmacy Exam Results: బీటెక్‌, బీఫార్మసీ ఫలితాలు విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో బీటెక్‌, బీఫార్మసీ ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ ఈ.కేశవరెడ్డి తెలిపారు.

బీటెక్‌ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌–20) రెగ్యులర్‌ పరీక్షకు 14,263 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 13,944 (98 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 6,414 మందికి గాను 6,365 మంది పాసయ్యారు. బాలురు 7,849 మందికి గాను 7,579 మంది ఉత్తీర్ణత చెందారు.

 బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌–19) రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలకు 2,492 మంది విద్యార్థులు హాజరు కాగా 1958 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1533 మందికి గాను 1347 మంది పాసయ్యారు. బాలురు 959 మందికి గాను 611 మంది ఉత్తీర్ణత చెందారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బి.చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

#Tags