ITI Counselling 2024: ప్రారంభమైన ఐటీఐ కౌన్సెలింగ్‌, ఎప్పటివరకంటే..

విజయనగరం రూరల్‌: 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 28 పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ప్రవేశాలకు బుధవారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, రాజాం ప్రభుత్వ ఐటీఐలలో 652 సీట్ల భర్తీకి గాను తొలిరోజు కౌన్సెలింగ్‌కు 89 మంది హాజరు కాగా 76 మందికి సీట్లు కేటాయించారు.

Hospitality Industry: ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!.. త్వరలోనే 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

ఐటీఐలలో సీట్లు పొందిన అభ్యర్థులకు ఐటీఐల జిల్లా కన్వీనర్‌, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ టీవీ గిరి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ నెల 26 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ కొనసాగనుందని, ర్యాంకుల వారీగా అభ్యర్థులు హాజరు కావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఐటీఐ టీవో రామాచారి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
 

#Tags