ITI Admissions: ఐటీఐలో అడ్మీషన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ ప్రభుత్వ ఐటీఐలో రెండో విడత అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024– 26 విద్యా సంవత్సరాలకు గానూ పలు ట్రేడ్‌లలో అడ్మిషన్‌ పొందడానికి విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

CBSE CTET Admit Card 2024: సీటెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

డీజిల్‌ మెకానిక్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌, డ్రాప్ట్‌మెన్‌ సివిల్‌, ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌ ట్రేడ్‌లలో చేరేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. అన్ని కోర్సుల్లో 33 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

#Tags