Admission in Gurukula Vidyalaya: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ప్రకాశం జిల్లా : ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోంది. నేడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. కార్పొరేట్‌ స్థాయిలో స్టడీ అవర్స్‌తో కూడిన ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. జగనన్న విద్యాకానుకగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, షూస్‌, యూనిఫాం, బెల్ట్‌, అమ్మ ఒడి పథకం వర్తింపు, సుందరమైన తరగతి గదులు, ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. చక్కని ల్యాబొరేటరీలలో కంప్యూటర్‌ విద్య, అన్ని వసతులతో వసతి గృహం, పౌష్టికాహారం, నిపుణులతో యోగా, వ్యాయామ విద్య, క్రీడలు, ఆరోగ్య పర్యవేక్షణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అందిస్తున్నారు.

5వ తరగతిలో చేరేందుకు అర్హత:
2023–24 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదివి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1–09–2011 నుంచి 31–08–2015 మధ్య జన్మించి ఉండాలి. బీసీ, ఓసీ అభ్యర్థులు 1–09–2013 నుంచి 31–08–2015 తేదీల మధ్య జన్మించి ఉండాలి.

చదవండి: Free Education in Private Schools: ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్మీడియెట్‌కు అర్హతలు:
2023–24లో పదో తరగతి చదివి మొదటిసారి ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులు తమ జిల్లాలోని కళాశాల/పాఠశాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్షకు మించకూడదు.

ప్రవేశ పరీక్ష తేదీ:
5వ తరగతి ప్రవేశ పరీక్ష 10–03–2024 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు.
ఇంటర్మీడియెట్‌ ప్రవేశ పరీక్ష 10–03–2024న మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు.

జిల్లాలో 11 గురుకుల పాఠశాలలు, కళాశాలలు:
జిల్లాలో 10 గురుకుల కళాశాలలు, 11 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. బాలికలకు సంబంధించి సింగరాయకొండ, దూపాడు ఆర్ట్స్‌, కొండపి, చీమకుర్తి, మార్కాపురం, కంభం, రాచర్ల సైన్స్‌ కళాశాలలు ఉన్నాయి. అబ్బాయిలకు సంబంధించి దర్శి, వెలుగొండ సైన్స్‌, అర్థవీడు ఆర్ట్స్‌ కళాశాలలు ఉన్నాయి.

ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్‌: https://apbragcet.apcfss.in

దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 28 ప్రవేశ పరీక్ష మార్చి 10వ తేదీ 5వ తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు నోటిఫికేషన్‌ జిల్లాలో 11 కళాశాలలు

ఇంటర్మీడియెట్‌, 5వ తరగతికి దరఖాస్తు చేసుకోవాలి
జిల్లాలోని 11 గురుకుల పాఠశాలలు, 10 కళాశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియెట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 800 మంది ఇంటర్మీడియెట్‌, 880 మంది విద్యార్థులు 5 వ తరగతిలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అన్నీ వసతులతో కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ, ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తారు.
– డీ జయ, ఏపీ ఎస్‌డబ్ల్యూర్‌ఈఐ సొసైటీ డీసీఓ

#Tags