Skip to main content

Free Education in Private Schools: ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ బి. సోమశేఖరరావు ప్రకటనలో తెలిపారు.
Invitation of Applications for Free Education    Coordinator B. Somasekhara Rao announcing free admissions in private schools for 2024-25 academic year

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు సీట్లు కేటాయిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌ పద్ధతిలో 1వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వచ్చేనెల 14 వరకు సీఎస్‌ఈ ఏపీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

చదవండి: Free Education in Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్‌ విద్య.. షెడ్యూల్‌ ఇలా..

Published date : 24 Feb 2024 03:50PM

Photo Stories