Hospitality Industry: ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!.. త్వరలోనే 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

ముంబై: ఆతిథ్య రంగం నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీంతో వచ్చే కొన్నేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ఆతిథ్య పరిశ్రమలో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సామర్థ్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం నిపుణుల కొరతకు కారణంగా పేర్కొంటున్నారు.

ప్రస్తుతం పరిశ్రమవ్యాప్తంగా డిమాండ్‌–సరఫరా మధ్య అంతరాయం 55–60 శాతంగా ఉంటుందని ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా డైరెక్టర్‌ సంజయ్‌ శెట్టి తెలిపారు. కరోనా విపత్తు తర్వాత పరిశ్రమలో బూమ్‌ (అధిక డిమాండ్‌) నెలకొందని, వచ్చే కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆతిథ్య పరిశ్రమలో నియామకాలు 4 రెట్లు పెరిగిన ట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరంభ స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్టు చెప్పారు. 

Bill Gates On AI Impact On Software Engineers: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏం చెప్పారు?

నిపుణుల అంతరాన్ని అధిగమించేందుకు ఆతిథ్య కంపెనీలు తమ సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు. పోటీతో కూడిన వేతనాలు ఆఫర్‌ చేస్తూ ఉన్న సిబ్బందిని కాపాడుకోవడంతోపాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘2023లో పర్యాటకం, ఆతిథ్య రంగం 11.1 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. 2024 చివరికి 11.8 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. 

NEET 2024 Controversy: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌.. ముందు రోజు రాత్రే విద్యార్థుల చేతికి.. 30 లక్షలకు డీల్‌

ఈ డిమాండ్‌ 2028 నాటికి 14.8 మిలియన్లకు పెరగొచ్చు. ఏటా 16.5 శాతం వృద్ధికి ఇది సమానం’’అని టీమ్‌లీజ్‌ బిజినెస్‌ హెడ్‌ ధృతి ప్రసన్న మహంత వివరించారు. ప్రస్తుత సిబ్బంది, భవిష్యత్‌ మానవ వనరుల అవసరాల మధ్య ఎంతో అంతరం కనిపిస్తున్నట్టు టీమ్‌లీజ్‌ సరీ్వసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్, స్టాఫింగ్‌ బిజినెస్‌ హెడ్‌ ఎ.బాలసుబ్రమణియన్‌ సైతం తెలిపారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అప్రెంటిస్‌షిప్‌ల ద్వారా నిపుణుల కొరతను తీర్చుకునేందుకు ఈ టాస్‌్కఫోర్స్‌ కృషి చేస్తోంది. 

#Tags