School Holidays : విద్యార్థులకు సెల‌వుల‌వార్త‌.. వ‌రుస‌గా ఐదు రోజులు.. కానీ..!!

సాక్షి ఎడ్యుకేష‌న్‌: పాఠ‌శాల విద్యార్తుల‌కు జూన్‌లోనే వేస‌వి సెల‌వులు ముగిసి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అయ్యాయి. అయితే, అప్ప‌టి నుంచి వ‌రుస‌గా వ‌ర్షాల కార‌ణంగా సెల‌వులు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం, పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభ‌మైనా.. మ‌రోసారి వ‌రుసగా సెల‌వులు ఒస్తున్నాయి. ఆగ‌స్ట్ నెల ప్రారంభం అంటే పండుగ‌లు కూడా ప్రారంభమే. అయితే, ఈ నెల‌లో పండుల సెల‌వులతోపాటు రెండో శ‌నివారం, ఆదివారాలు ఉండ‌డంతో సెల‌వులు వ‌రుస‌గా మారాయి.

AP & TS NEET UG Cutoff Marks 2024 : ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ -2024 కటాఫ్‌ మార్కులు ఇవే.. కౌన్సెలింగ్ తేదీలు ఇవే..!

ఈ తేదీల‌కే..
ఆగ‌స్టు నెల‌లో స్వాతంత్య్ర దినోత్స‌వం, వ‌ర‌ల‌క్ష్యీ వ్ర‌తం, ఆదివారం, రాఖీ పౌర్ణ‌మి ఉన్నాయి. అయితే, మ‌ధ్య‌లో రెండో శ‌నివారం ఉండ‌డంతో వ‌రుస‌గా నాలుగు సెల‌వులు వ‌చ్చాయి. వీటి మ‌ధ్య‌లో ఒక‌రోజు సెల‌వు తీసుకుంటే ఐదు రోజులు సెల‌వుల‌న్న‌ట్టే. మ‌రి విద్యార్థులంద‌రికీ పండగే క‌దా.. అయితే, పాఠ‌శాల‌లు, ప్రాంతాలు వీటి ఆధారంగా కూడా సెల‌వులు ప్ర‌క‌టిస్తారు కాబ‌ట్టి పాఠ‌శాల‌లు లేదా కాలేజీలు కూడా ప్ర‌క‌టిస్తేనే స‌రైన‌ది.

Child Marriages: బాల్య వివాహాల్లో ముందున్న రాష్ట్రాలు ఇవే..

 

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags