Monday Holiday for Colleges : భారీ వర్షాల కారణంగా నేడు ఈ కళాశాలలకు సెలవు.. వాయిదా పడ్డ పరీక్షలు.. ఈ తేదీలకే!
సాక్షి ఎడ్యుకేషన్: గత కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవడంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే, తాజాగా జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కళాశాలలకు కూడా ప్రభుత్వం సెలవులను ప్రకటించారు.
School Holidays: నేడు విద్యాసంస్థలకు సెలవు
ప్రస్తుతం, వారికి జరుగుతున్న పరీక్షలకు కూడా వర్షాల కారణంగా వాయిదా వేసారు. సోమవారం విద్యార్థులకు నిర్వహించాల్సిన అన్ని రకాల పరీక్షలకు వాయిదా వేసి జేఎన్‌టీయూహెచ్ ఈనెల 5వ తేదీకి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఈ నెల 3వ తేదీన యథావిధిగా పరీక్షలు జరుతాయన్నారు.
#Tags