Holiday on 22nd January 2024 : దేశవ్యాప్తంగా జనవరి 22వ తేదీన సెలవు ప్రకటించిన కేంద్రం..
ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన చేశారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, హర్యానా రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా రాష్ట్రంలో పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
☛ Ayodhya Ram Mandir Live Updates 2024 : అయోధ్య రామ జన్మభూమి కేసులో..ఒకేఒక్కడు.. కళ్లు ఉండి చేయలేని పనిని.. కళ్లు లేని ఈ స్వామీ..
ఈ నేపధ్యంలోనే ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రాల్లో ఈ నెల 22న పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే..
ఉత్తర ప్రదేశ్‌లో
ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.
గోవాలో..
22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది.
హర్యానాలో..
హర్యానాలో కూడా రామ్‌లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది.
☛ Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?
☛ AP Holidays 2024 List : ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్, కాలేజీలకు మాత్రం..