Good News Sankranti Holidays Extended 2024 : గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి సెలవులు పొడిగింపు..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘ‌నంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో సంక్రాంతి టాప్‌లో ఉంటుంది. అలాగే ఈ పండ‌గ‌ల‌కు స్కూల్స్, కాలేజీల‌కు ఎక్కువ రోజులు సెలవులు కూడా వ‌స్తాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వరుసగా 13 రోజులు పాటు సెలవులు వ‌చ్చాయి.

అలాగే తెలంగాణలో కూడా దాదాపు వారం రోజులు సెలవులు వచ్చాయి. తెలంగాణ సర్కార్ పాఠశాలలకు జనవరి 12వ తేదీ నుంచి సెలవులు ప్రకటించింది. అంటే దాదాపు 6 రోజులు పాటు సెలవులు ఇచ్చింది. జూనియర్ కాలేజీలకు కూడా మొత్తం 4 రోజులు సెలవులు ప్రకటించింది. వీరికి జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. అకాడమిక్ క్యాలెండర్‌లో అంతకుముందు ఓసారి ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోసారి వెల్లడించారు. అయితే అన్ని ప్రైవేట్ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని బోర్డు కార్యదర్శి హెచ్చరించారు. 

☛ All Educational Institutions Holiday : గుడ్‌న్యూస్‌.. జనవరి 22 అన్ని విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే..?

ఒక వేళ మీరు 19,20వ తేదీల్లో కూడా సెలవు తీసుకుంటే..

ఇటు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు. జ‌న‌వ‌రి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే వారం రోజులు సెలవులు వచ్చాయి. ఏపీలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు పదిరోజులు ఉన్నాయి. జనవరి 9వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని అధికారులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. పాఠశాల విద్యార్థులకు పదిరోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి. అంటే ఏపీలో పాఠశాలలు తిరిగి జనవరి 19న ప్రారంభం అవుతాయి. ఒక వేళ మీరు 19,20వ తేదీల్లో కూడా సెలవు తీసుకుంటే.. తర్వాత రోజు ఆదివారం వస్తుంది. ఇలా మొత్తం 13 రోజులు సంక్రాంతికి సెలవులు వస్తున్నాయి. అలాగే ఏపీ, తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా వరుసగా సెలవులు వచ్చాయి. జనవరి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో సంక్రాంతి సెలవులు జ‌న‌వ‌రి 21వ తేదీ వరకు పొడిగించినట్లు సమాచారం. అలాగే మ‌రికొన్ని స్కూల్స్‌, కాలేజీలు సంక్రాంతి సెలవులు పొడిగించే అవ‌కాశం ఉంది.

☛ IAS Success Journey : స్మార్ట్‌గా ఆలోచించింది.. ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యాందిలా.. కానీ మ‌ళ్లీ..

జనవరి 22 సోమవారం నుంచి పాఠశాలకు, కాలేజీలకు..?
జనవరి 22 సోమవారం నుంచి పాఠశాలకు, కాలేజీలకు విద్యార్థులు వెళ్లాల్సి ఉంటుంది. ఈ అద‌న‌పు సెల‌వుల‌పై ప్ర‌భుత్వం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు మీ స్కూల్, కాలేజీ వాళ్ల నుంచి స‌మాచారం తెలుసుకొని సెల‌వులు తీసుకోండి.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

☛ Inspiring Success Story : యదార్ధ కథ.. ఆక‌లి త‌ట్టుకోలేక బిక్షాటన చేసి క‌డుపు ఆక‌లి తీర్చుకునే వాళ్లం.. ఈ క‌సితోనే చ‌దివి జిల్లా ఎస్పీ స్థాయికి వ‌చ్చానిలా..

#Tags